🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 24 Aug 2026, 10:28 PM

QR Code

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై బిగ్ రిలీఫ్.. వారికి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

News Image

హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాల నిధుల విడుదలపై గతంలో విధించిన మధ్యంతర స్టేను సవరించిన న్యాయస్థానం.. దివ్యాంగ వధువులకు ఆర్థిక సాయం అందించేందుకు అనుమతి ఇచ్చింది.దివ్యాంగ వధువులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందించే ఆర్థిక సాయంపై ఉన్న స్టేను హైకోర్టు తాజాగా తొలగించింది. దీంతో దివ్యాంగ లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది.

అయితే దివ్యాంగులు మినహా ఇతర సాధారణ వర్గాల లబ్ధిదారులకు మాత్రం నిధుల విడుదలపై ఉన్న స్టే కొనసాగుతుంది అని హైకోర్టు స్పష్టం చేసింది.కాగా, 2014 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకాల అమలుకు సంబంధించి 2014 నుంచి జారీ చేసిన ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వుల అమలుపైనా కోర్టు స్టే విధించింది. అర్హులైన లబ్ధిదారులకు చెల్లింపులు చేయరాదని ఆదేశించింది.నిధుల విడుదలపై ఉన్న స్టేను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను గతంలో న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు అందడంలో ఇబ్బందులు ఉన్న సమయంలో ఉచిత పథకాల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.ప్రజలు చెల్లించే పన్నుల సొమ్మును ఉచిత పథకాలకు మళ్లించడం, శాసనసభ ఆమోదం లేని పథకాలకు వందల కోట్ల రూపాయలు కేటాయించడం సమంజసమేనా అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

🏠 Home