🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 25 Aug 2026, 6:35 AM

QR Code

జర్నలిస్టులకు అండగా టీజేఎఫ్

News Image

ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు: 24:

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో TUWJ TJF ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ సమావేశం గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారం దిశగా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాలని ప్రధానంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి అండగా ఉండాలని, ఇళ్ల స్థలాల అంశంలో రాజీలేని పోరాటం చేయడంలో TJF ప్రెస్ క్లబ్ కమిటీ ఎప్పుడు ముందుంటుందని, గతంలో వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, కలిసి వచ్చే వారితో ఉద్యమ పోరాటం చేయటంలో ముందుంటుందని, అక్రిడేషన్ కార్డులు పూర్తిస్థాయిలో అర్హులకు అందివ్వాలని, యూనియన్ మరింత బలోపేతం చేయడంలో ఐక్యంగా కలిసి పనిచేయాలని తీర్మానించడం జరిగింది.

ఈ సమావేశంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి బిక్కీ గోపి , నగర కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, జిల్లా యూనియన్ ఉపాధ్యక్షులు మందుల ఉపేందర్, మీడియా ఇంచార్జ్ తిరుపతిరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్వీ రెడ్డి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు రేపాక యాదగిరి, పులి శ్రీను,మూల జీవన్ రెడ్డి, సహాయ కార్యదర్శిలు ఉల్లోజు రమేష్, నాయకులు రోసి రెడ్డి, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు, కూరపాటి నరేష్, రేపల్లె నాగ శేఖర్ , మురళి, లింగయ్య, రామకృష్ణ, శివరామకృష్ణ, మాధవి, కిరణ్మయి, పాషా, రవి, సాంబ, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

🏠 Home