🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 25 Aug 2026, 6:39 PM

QR Code

గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం

News Image

అంజయ్య నగర్‌లో అక్రమ కట్టడాల తొలగింపు

రెండు భవనాలను ఇప్పటికే నేలమట్టం చేసిన అధికారులు

ఆరంతస్తుల భవనం కూల్చివేతకు శ్రీకారం

ఏడంతస్తుల భవనం కూలిన ఘటన తర్వాత కఠిన చర్యలు

హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో అక్రమ, ప్రమాదకర నిర్మాణాలపై అధికారులు చేపట్టిన కూల్చివేతల ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా అధికారులు కలిసి భారీ యంత్రాలతో పలు నిర్మాణాలను తొలగిస్తున్నారు.

ఇప్పటికే రెండు భవనాలను పూర్తిగా కూల్చివేసిన అధికారులు.. మరో ఆరంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేసే పనులు చేపట్టారు. కూల్చివేతల నేపథ్యంలో పోలీసులు, అధికారులు భారీగా మోహరించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

అంజయ్య నగర్‌లో గత శనివారం ఏడంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు వేగవంతం చేశారు.

అనుమతులు లేకుండా నిర్మించినవి, నిర్మాణపరంగా ప్రమాదకరంగా ఉన్న కట్టడాలను పరిశీలించి అవసరమైన చోట కూల్చివేతలు చేపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

🏠 Home