రేపటి నుంచే ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఏ రోజు ఎక్కడంటే?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికకు ఆగస్టు 28 నుంచి 31 వరకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున మొత్తం 16 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ జరగనుంది.
లాటరీ కేంద్రాల్లో స్థలాభావం, భద్రతా కారణాలతో దరఖాస్తుదారులందరికీ ప్రవేశం ఉండదని అధికారులు తెలిపారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే స్క్రీన్ల ద్వారా డ్రాను వీక్షించవచ్చు. అలాగే టీజీహెచ్బీ వెబ్సైట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
📅 లక్కీ డ్రా షెడ్యూల్
ఆగస్టు 28
కుత్బుల్లాపూర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్
రాజేంద్రనగర్
నాంపల్లి
ఆగస్టు 29
ఖైరతాబాద్
కూకట్పల్లి
అంబర్పేట
బహదూర్పుర
ఆగస్టు 30
శేరిలింగంపల్లి
మలక్పేట
ఇబ్రహీంపట్నం
మేడ్చల్
ఆగస్టు 31
మల్కాజిగిరి
సనత్నగర్
మహేశ్వరం
కార్వాన్
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.