🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 August 2026, 7:03 pm Posted by : ARYADVI NEWS

హెల్మెట్‌ పెట్టుకో అన్నయ్యా.. రాఖీ కట్టి చెప్పిన పోలీసులు!

News Image
కామారెడ్డి: రక్షాబంధన్‌ పండుగను పురస్కరించుకుని కామారెడ్డి ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌లపై వెళ్తున్న వాహనదారులను నిలిపి.. జరిమానా వేయకుండా వారికి రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై సందేశం ఇచ్చారు.

మహిళా ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు తిలకం పెట్టి రాఖీ కడుతూ.. “అన్నయ్యా.. హెల్మెట్‌ తప్పనిసరిగా పెట్టుకోండి. ఇంటి వద్ద మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది” అంటూ ఆప్యాయంగా సూచించారు. హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయాలయ్యే ముప్పు తగ్గుతుందని వివరించారు.

‘రక్షాబంధన్‌–సురక్షాబంధన్‌’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. హెల్మెట్‌ అనేది కేవలం పోలీసుల భయంతో పెట్టుకునేది కాదని.. మన ప్రాణాల రక్షణ కోసం ఉపయోగపడే ముఖ్యమైన భద్రతా సాధనమని పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాఖీ కట్టి పోలీసులు చెప్పిన మాటలకు పలువురు వాహనదారులు స్పందిస్తూ.. ఇకపై హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపబోమని హామీ ఇచ్చారు.
🏠 Home