🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 August 2026, 6:19 pm Posted by : ARYADVI NEWS

హైదరాబాద్‌కు రావొద్దు.. రెండు రోజుల్లో నేనే గుంటూరు వస్తా: అంబటి రాంబాబు

News Image
స్టెంట్ల చికిత్స విజయవంతం.. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా గుండెలో రెండు బ్లాకులు గుర్తించారని, వైద్యులు విజయవంతంగా స్టెంట్లు వేసి చికిత్స పూర్తి చేశారని తెలిపారు.

తనను పరామర్శించేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ హైదరాబాద్‌కు రావద్దని అంబటి రాంబాబు కోరారు. రెండు రోజుల్లో తానే గుంటూరుకు తిరిగి వస్తానని, అక్కడే అందరినీ కలుసుకుంటానని చెప్పారు.

శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురైన అంబటి రాంబాబును కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ చేశారు. గుండె రక్తనాళాల్లో రెండు బ్లాకులు ఉన్నట్లు గుర్తించి స్టెంట్లు వేశారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైంది.
🏠 Home