🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 30 Aug 2026, 8:10 AM

QR Code

బిర్యానీ పాత్రలో మనిషి శరీర భాగాలు.. భార్యాభర్తల అరెస్టు

News Image

చెన్నై: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో సూట్‌కేస్‌లో మనిషి శరీర భాగాలు లభించిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మణిపుర్‌లో నిందితులైన మాణిక్‌ ఉత్తిన్‌ లస్కర్‌, అతని భార్య భాగమతి మాజీని శనివారం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో.. చెన్నై గూడువాంజేరిలో హైతుల్లా నిషా (38) అనే మహిళ హత్యకు గురైనట్లు గుర్తించారు. ఆమెతో మాణిక్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిషా గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. అబార్షన్‌ చేయించుకోవాలని మాణిక్‌ చెప్పినట్లు వెల్లడించారు.

ఈ విషయం మాణిక్‌ భార్య భాగమతికి తెలియడంతో దంపతుల మధ్య నిషా విషయంలో గొడవలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం నిషాతో మాట్లాడేందుకు వెళ్లిన మాణిక్‌, భాగమతితో ఆమెకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొన్ని భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి చెన్నై–దిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని భాగాలను ఓ పాత్రలో ఉంచినట్లు గుర్తించారు. వాటిని తొలగించే ప్రయత్నంలో పోలీసులకు సమాచారం అందడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

అసోం, ఒడిశా తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు మణిపుర్‌లో నిందితులను పట్టుకున్నారు. వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై తమిళనాడుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మృతురాలి తలను ఎక్కడ పడేశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

🏠 Home