🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 30 Aug 2026, 6:13 PM

QR Code

ఒకే కాన్పులో ఇద్దరు శిశువులు.. కానీ తల్లిదండ్రులు వేర్వేరు!

News Image

🇦🇺 ఆస్ట్రేలియాలో అరుదైన సరోగసీ ఘటన

👶 ఒకే మహిళ ఒకే కాన్పులో ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది

👧 ఒకరు సరోగసీ ద్వారా పుట్టిన పాప.. 👦 మరొకరు ఆమె సొంత బిడ్డ

🧬 జన్యు పరీక్షల్లో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు వేర్వేరని నిర్ధారణ

⚖️ ఈ ఘటనపై క్విన్స్‌లాండ్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది

అసలు ఏం జరిగింది?

క్విన్స్‌లాండ్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ సరోగేట్ తల్లిగా ఓ జంట కోసం బిడ్డను కనడానికి అంగీకరించింది. 2025 ఏప్రిల్‌లో ఆ జంటకు చెందిన పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు. అయితే అదే సమయంలో ఆమె తన భర్తతో సహజంగా కూడా గర్భం దాల్చింది.

తర్వాత స్కానింగ్‌లో గర్భంలో రెండు పిండాలు ఉన్నట్లు గుర్తించారు. జన్యు పరీక్షల్లో ఒకరు సరోగసీ కోరుకున్న జంటకు చెందిన పాప కాగా, మరొకరు సరోగేట్ తల్లి, ఆమె భర్తకు చెందిన అబ్బాయి అని తేలింది.

2025 నవంబర్‌లో ఆమె ఇద్దరు శిశువులకు ఒకేసారి సిజేరియన్ ద్వారా జన్మనిచ్చింది.

ఈ ఘటనపై తల్లిదండ్రుల హక్కుల విషయంలో వివాదం ఏర్పడగా, కేసు కోర్టుకు వెళ్లింది. ఇద్దరు పిల్లలు ఒకే గర్భంలో పెరిగినప్పటికీ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు పద్ధతుల్లో గర్భం దాల్చినందున వారిని జన్మతః తోబుట్టువులుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.

దీంతో సరోగసీ కోరుకున్న జంటకు వారి కుమార్తెపై చట్టపరమైన హక్కులు లభించాయి. ప్రస్తుతం రెండు కుటుంబాలు తమ తమ పిల్లలను పెంచుకుంటున్నాయి.

🏠 Home