🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 30 Aug 2026, 6:40 PM

QR Code

వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్.. హెడ్ రెగ్యులేటర్‌కు చేరిన కృష్ణా జలాలు!

News Image

ప్రకాశం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ట్రయల్ రన్‌ ఆదివారం విజయవంతంగా ముగిసింది. కొల్లం వాగు వద్ద అధికారులు గేట్లు ఎత్తి కృష్ణా జలాలను సొరంగంలోకి విడుదల చేయగా.. నీరు గంటవానిపల్లి క్రాస్ హెడ్ రెగ్యులేటర్‌కు చేరుకుంది.

ట్రయల్ రన్ సందర్భంగా గేట్ల పనితీరు, సొరంగంలో నీటి ప్రవాహ వేగం, నీటి తరలింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. ముందుజాగ్రత్తగా హెడ్ రెగ్యులేటర్ వద్ద సైరన్ మోగించి సమీప ప్రజలను అప్రమత్తం చేశారు.

సోమవారం సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం ముందు భాగం నుంచి సుమారు 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను తరలించి నల్లమల సాగర్‌లో నిల్వ చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందనుంది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రజల దశాబ్దాల నీటి కష్టాలకు వెలిగొండ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపనుందని అధికారులు తెలిపారు.

🏠 Home