15 ఏళ్లకే దుమ్మురేపాడు.. దులీప్ ట్రోఫీలో 57 ఏళ్ల రికార్డు బద్దలు
42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కాడు. దులీప్ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన వైభవ్.. అత్యంత పిన్న వయసులో అర్ధశతకం సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
కేవలం 15 ఏళ్ల 175 రోజుల వయసులో వైభవ్ ఈ ఘనత సాధించాడు. 42 బంతుల్లోనే సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 1969లో లక్ష్మణ్ సింగ్ నెలకొల్పిన 57 ఏళ్ల రికార్డు తెరమరుగైంది. అప్పట్లో లక్ష్మణ్ సింగ్ 16 ఏళ్ల 23 రోజుల వయసులో దులీప్ ట్రోఫీలో అర్ధశతకం సాధించాడు.
శతకానికి 8 పరుగుల దూరంలో..
రికార్డు హాఫ్ సెంచరీతో ఆగని వైభవ్.. దూకుడైన బ్యాటింగ్‌తో 81 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీకి మరో 8 పరుగుల దూరంలో ఉండగానే ఔటయ్యాడు.
కెప్టెన్‌గా కూడా మెరుపులు
ఈ మ్యాచ్‌లో వైభవ్‌కు మరో అవకాశం అనుకోకుండా వచ్చింది. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కుడి మణికట్టుకు గాయం కావడంతో కొంతసేపు మైదానం వీడాడు. దీంతో వైభవ్ దాదాపు గంటపాటు జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో అతడు తీసుకున్న డీఆర్ఎస్ కూడా సక్సెస్ కావడం విశేషం.
బౌలింగ్‌లోనూ సత్తా
క్వార్టర్ఫైనల్లో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో వైభవ్ ఆకట్టుకున్నాడు. నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్లో మరో సంచలనంగా ఎదుగుతున్నాడు.