మద్యం మానేసినా లివర్ ఎందుకు బాగుపడదు?.. అసలు కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు
హైదరాబాద్: మద్యపానం వల్ల కాలేయం దెబ్బతినడం తెలిసిందే. అయితే మద్యం పూర్తిగా మానేసిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తుల్లో లివర్ ఆరోగ్యం ఎందుకు మెరుగుపడటం లేదన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు కీలక సమాధానం కనుగొన్నారు. కాలేయ కణాలు పునరుత్పత్తి చెందే ప్రక్రియలో మధ్యలోనే నిలిచిపోవడం సమస్యకు ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు.
కాలేయానికి గాయం లేదా నష్టం జరిగినప్పుడు దాని కణాలు తిరిగి కొత్త కణాలను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని కణాలు తాత్కాలికంగా మూలకణాల మాదిరి స్థితికి వెళ్లి వేగంగా విభజన చెందుతాయి. అనంతరం తిరిగి సాధారణ కాలేయ కణాలుగా మారతాయి.
అయితే అధిక మద్యపానం కారణంగా ఏర్పడే ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధుల్లో ఈ సహజ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. దెబ్బతిన్న కణాలు పూర్తిగా కొత్త స్థితికి మారలేక, సాధారణ కణాలుగా కూడా తిరిగి పనిచేయలేక మధ్యంతర దశలోనే నిలిచిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
‘ESRP2’ ప్రొటీన్దే కీలక పాత్ర
కాలేయ కణాల్లో జరిగే ఈ మార్పులకు ‘RNA స్ప్లైసింగ్’ ప్రక్రియతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. జన్యువుల నుంచి వచ్చే సమాచారాన్ని ప్రొటీన్ల తయారీకి అనుగుణంగా సక్రమంగా అమర్చడంలో ఈ ప్రక్రియ కీలకంగా పనిచేస్తుంది.
మద్యపానం కారణంగా కాలేయంలో ఏర్పడే వాపు.. ఈ ప్రక్రియను నియంత్రించే ESRP2 అనే ప్రొటీన్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. దీంతో జన్యు సమాచార నిర్వహణలో లోపాలు ఏర్పడి కాలేయ కణాల పనితీరు దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు.
ఎలుకలపై ప్రయోగాల్లోనూ నిర్ధారణ
ESRP2 లోపం వల్ల కలిగే ప్రభావాలను తెలుసుకునేందుకు పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రొటీన్ లేని ఎలుకల్లోనూ కాలేయం పునరుత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు గుర్తించారు. ప్రయోగశాలలో నిర్వహించిన మరో పరీక్షలో వాపును ప్రేరేపించే సంకేతాన్ని అడ్డుకోవడంతో ESRP2 స్థాయులు మెరుగుపడి, RNA స్ప్లైసింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి చేరినట్లు పరిశోధకులు గుర్తించారు.
భవిష్యత్ చికిత్సకు కొత్త దారి
ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కాలేయంలో వాపును నియంత్రించడంతో పాటు ESRP2 పనితీరును పునరుద్ధరించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన ఉపయోగపడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తీవ్ర కాలేయ వ్యాధులతో బాధపడేవారికి భవిష్యత్తులో కాలేయ మార్పిడి అవసరాన్ని తగ్గించే కొత్త చికిత్సా మార్గాలకు ఈ పరిశోధన పునాది కావచ్చని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది పరిశోధనా దశలోనే ఉందని, అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయంగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.