చెవిరెడ్డికి ఊరట.. అమెరికాకు అనుమతి
వైద్యం కోసం సెప్టెంబర్ 3–13 వరకు అమెరికా పర్యటన
షరతులతో అనుమతించిన విజయవాడ ఏసీబీ కోర్టు
తిరిగొచ్చిన వెంటనే పాస్పోర్టు అప్పగించాలని ఆదేశం
విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 13 వరకు ఆయన అమెరికాలో ఉండనున్నారు. పర్యటనకు సంబంధించిన చిరునామా, ఫోన్, ఈ-మెయిల్ వివరాలను కోర్టుకు సమర్పించాలని, తిరిగి వచ్చిన వెంటనే పాస్పోర్టును అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది.