‘రోమాంచకం’లో ఆ సీన్స్ ఎంజాయ్ చేశా: అనంతిక
బబ్లీ గర్ల్గా కనిపించనున్న మలయాళ నటి
ప్రేమ, హాస్యం, ఉత్కంఠతో సినిమా
సెప్టెంబర్ 3న విడుదల
‘8 వసంతాలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటి అనంతిక సనీల్ కుమార్ తాజాగా ‘రోమాంచకం’లో నటించింది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అనంతిక మాట్లాడుతూ.. ఈ కథ తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది. సినిమాలో సరదాగా ఉండే బబ్లీ గర్ల్ పాత్రలో నటించానని, ఇలాంటి క్యారెక్టర్ చేయాలన్నది తన కల అని చెప్పింది. ప్రేమతో పాటు హాస్యం, ఉత్కంఠ ఉన్న ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుందని పేర్కొంది.
సుమంత్ ప్రభాస్తో తనకు వచ్చే సన్నివేశాలు సహజంగా ఉంటాయని, వాటిని చిత్రీకరించే సమయంలో ఎంతో ఆనందించానని తెలిపింది. సందీప్ రెడ్డి వంగా బ్యానర్లో నటించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది.