🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 01 Sep 2026, 12:22 PM

QR Code

చిత్రకూట్‌ను ముంచెత్తిన భారీ వరదలు

News Image

30 అడుగుల మేర ఉప్పొంగిన మందాకిని నది..

నీట మునిగిన ఇళ్లు..

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. మందాకిని నది ఉగ్రరూపం దాల్చడంతో వందలాది ఇళ్లు, దుకాణాలు నీట మునిగాయి. బార్గి డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం మరియు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నది ఏకంగా 30 అడుగుల మేర ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనివల్ల నివాస ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు ఇళ్లపైకి చేరగా, అనేక వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

🏠 Home