🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 September 2026, 5:58 pm Posted by : ARYADVI NEWS

టీమిండియాలోకి రీఎంట్రీపై రుతురాజ్ ధీమా

News Image
పరుగులపైనే పూర్తి ఫోకస్‌
దేశవాళీ సీజన్‌పై దృష్టి
అవకాశం వస్తే సత్తా చాటుతానన్న రుతురాజ్‌

టీమిండియాలోకి తిరిగి రావడంపై భారత బ్యాటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ధీమా వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధించి మరోసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని తెలిపాడు.

కోయంబత్తూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన రుతురాజ్‌ను టీమిండియా రీఎంట్రీపై మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ తాను చాలా నమ్మకంగా ఉన్నానని, పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టానని చెప్పాడు. అవకాశాన్ని పొందేందుకు ఇక నిలకడగా రాణించాల్సి ఉందని పేర్కొన్నాడు.

ప్రస్తుతం దేశవాళీ సీజన్‌కు సిద్ధమవుతున్న రుతురాజ్‌.. దులీప్‌ ట్రోఫీ, ఇరానీ కప్‌, రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీల్లో రాణించడంపై ఫోకస్‌ పెట్టాడు.

ఇక ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్‌ మ్యాచ్‌ నేపథ్యంలో రషీద్‌ ఖాన్‌, సూర్యవంశీ మధ్య పోరుపై ప్రశ్నించగా.. దానిపై తాను పెద్దగా ఆలోచించలేదని రుతురాజ్‌ చెప్పాడు. జట్టులో లేనప్పుడు మ్యాచ్‌లను ఎక్కువగా చూడనని, ప్రస్తుతం తన సాధనపైనే దృష్టి పెట్టానని తెలిపాడు.
🏠 Home