🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 01 Sep 2026, 6:02 PM

QR Code

కవితకు ప్రశాంత్ రెడ్డి కౌంటర్

News Image

కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత తెలుసుకోవాలన్న ప్రశాంత్ రెడ్డి

తండ్రి-కూతురిని కలపడానికే ప్రయత్నించానని వెల్లడి

కవిత పార్టీ లైన్ దాటడం వల్లే చర్యలు తీసుకున్నారని వ్యాఖ్య

కవిత తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంట నిలిచింది ఎవరో కవిత తెలుసుకోవాలని అన్నారు. తన చర్యల వల్ల కేసీఆర్ మనోవేదనకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.

తాను ఎప్పుడూ కేసీఆర్‌, కవితను కలిపేందుకు ప్రయత్నించానే తప్ప.. వారిద్దరినీ విడదీయడానికి కాదని స్పష్టం చేశారు. తాను, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి పార్టీ ఆవిర్భావానికి ముందే కేసీఆర్‌తో కలిసి పనిచేశామని గుర్తుచేశారు.

కవిత మధ్యలో పార్టీలోకి వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ లైన్ దాటినందుకే ఆమెపై చర్యలు తీసుకున్నారని తెలిపారు.

తాను కాంగ్రెస్ నేతలతో ఎలాంటి మంతనాలు జరపలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేసి చెప్పగలనన్నారు. మరి కాంగ్రెస్‌తో కవిత రహస్యంగా చర్చలు జరపలేదని ఆమె చెప్పగలరా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా బీఆర్‌ఎస్‌ను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. సభలో కవిత కన్నీళ్లు పెట్టుకోవడం సానుభూతి కోసం చేసిన రాజకీయమని విమర్శించారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీ చేయడంలో తన పాత్ర ఏంటో కేసీఆర్‌కు తెలుసని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

🏠 Home