🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 01 Sep 2026, 6:12 PM

QR Code

హైదరాబాద్ ప్రమాదం.. ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్

News Image

రోడ్డు ప్రమాదంలో నందులాల్ మృతి

సీసీటీవీ ఆధారంగా రెండు కార్ల గుర్తింపు

రెండో కారు డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన నందులాల్ అనే వ్యక్తి మృతి చెందాడు.

ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే రహదారిపై నందులాల్ రోడ్డు దాటుతుండగా సందీప్ కారు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన నందులాల్‌ను జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి ఆసుపత్రికి తరలించేందుకు తన కారులో తీసుకెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో మహీంద్రా కారు ఆ వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నందులాల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో రెండు వాహనాలను గుర్తించారు. కార్లను స్వాధీనం చేసుకుని ఆనంద్ సాయిని విచారించిన అనంతరం ఆయన కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రెండో కారు డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతోంది.

🏠 Home