🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 01 Sep 2026, 6:18 PM

QR Code

ఏపీకి 13 నవోదయలు, మరో ఎయిమ్స్‌: ఎంపీ విజ్ఞప్తి

News Image

నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం

13 జిల్లాల్లో నవోదయల ఏర్పాటుకు విజ్ఞప్తి

రెండో ఎయిమ్స్‌కు నిధులు ఇవ్వాలని కోరిన ఎంపీ

జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా 13 జవహర్‌ నవోదయ విద్యాలయాలు, రెండో ఎయిమ్స్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం సమర్పించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు ఉన్నాయని రమేశ్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య అందించేందుకు మిగిలిన 13 జిల్లాల్లోనూ నవోదయలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇందుకోసం సుమారు రూ.1,096 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో రెండో ఎయిమ్స్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

🏠 Home