🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 01 Sep 2026, 6:57 PM

QR Code

వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

News Image

ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్, 1:

ఖమ్మం నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేక దృష్టి సారించారు. మున్నేరు నదిలో ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయంగా అనువైన చెరువులను మంగళవారం పరిశీలించారు.

పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులు, సంభాద్రి ఉత్సవ కమిటీ తో కలిసి నిమజ్జనానికి అనువైన చెరువులను సందర్శించి, అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అందులో భాగంగా ఖమ్మం అర్బన్ మండలంలోని దంసలాపురం గ్రామపంచాయతీ లోని కొత్తూరు చెరువు సందర్శించి పరిశీలించారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

నిమజ్జన ప్రాంతాల్లో విగ్రహాల తరలింపు, వాహనాల రాకపోకలు, పార్కింగ్, భక్తుల భద్రత తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్బంగా సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఎస్బి ఏసీపీ మహేష్, ఇన్స్పెక్టర్ మోహన్ బాబు, భానుప్రకాష్, సంభాద్రి ఉత్సవ కమిటీ వినోద్ లాహుటి, విద్యాసాగర్ శ్రీహరి, ప్రసన్నకృష్ణ,సుధాకర్ యుగేందర్ శర్మ, సురేష్ శర్మ పాల్గొన్నారు.

🏠 Home