హెల్మెంట్, నంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్: తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ
ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్,, 1 :
ద్విచక్ర వాహనాలకు సరియైన నంబర్ ప్లేట్, హెల్మెంట్ లేకుండా వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. తల్లాడ లో మంగళవారం సరైన నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలు పాల్పడి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో ముమ్మర తనిఖీ చెప్పటారు. సరైన నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించి, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి, సరైన నెంబర్ ప్లేట్లు తెచ్చుకొని అమర్చిన వాహనాలకు వెసులుబాటు కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యంగా రోడ్లపై వాహనాలు నిలపడం ద్వారానే జరుగుతున్నాయని, అదేవిదంగా మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, రోడ్లపై తిరిగే వాహనాలకు తప్పనిసరిగా అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండాలని, ప్రతీ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. పెండింగ్ ఛానళ్లు చెల్లించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న ట్రాఫిక్ నిబంధనలకు ప్రజలు సహకరించాలని కోరారు