🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 01 Sep 2026, 8:00 PM

QR Code

ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

News Image

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని కోరుతూ గార్ల మండల విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా టీఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి. వీరునాయక్‌ మాట్లాడుతూ.. సీపీఎస్‌ విధానం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భద్రతలేని భవిష్యత్తును మిగుల్చుతుందని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీఏటీఎఫ్‌ మండల అధ్యక్షుడు పాపావత్‌ యాదగిరినాయక్‌, రెవెన్యూ సంఘం డీటీ శ్రీరాం నాయక్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు మాలోత్‌ శివనాయక్‌, మాచర్ల సుందర్‌కుమార్‌, జి. బాలాజీనాయక్‌, వీరునాయక్‌, సురేందర్‌రెడ్డి, జబ్బ వీరస్వామి, కబ్బాకుల వెంకన్న, వెంకట్‌రెడ్డి, పీఈటీ శ్రీను, రజిత, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

🏠 Home