🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 02 Sep 2026, 8:51 AM

QR Code

స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్

News Image

ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు

పులివెందుల: స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రతి స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మంగళవారం పులివెందుల భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్న అనంతరం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని, ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికలకు సన్నద్ధం కావాలని జగన్ సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో చర్చించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

🏠 Home