🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 September 2026, 6:14 pm Posted by : ARYADVI NEWS

విజృంభిస్తున్న ఎబోలా.. 3,000 దాటిన మరణాలు

News Image
కాంగోలో 6,186 కేసులు.. 6 ప్రావిన్స్‌లకు వైరస్ వ్యాప్తి

కాంగో: ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మే 15 నుంచి ఇప్పటివరకు ఎబోలా బారిన పడి 3,007 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 6,186 కేసులు నమోదైనట్లు తెలిపారు.

దేశంలోని ఆరు ప్రావిన్స్‌లలో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేసులను గుర్తించడం కష్టంగా మారుతోందని తెలిపారు. మరణాల్లో దాదాపు 60 శాతం చికిత్స కేంద్రాల బయటే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
🏠 Home