2046 నాటికి భారత్.. 20 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ!
రాబోయే దశాబ్దంలో 7% సగటు వృద్ధి సాధిస్తే లక్ష్యం సులువే
న్యూఢిల్లీ: 2046 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు.
‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించాలంటే రాబోయే దశాబ్దంలో భారత్ సగటున 7 శాతం వాస్తవ జీడీపీ వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డాలర్ పరంగా ఏటా 10 శాతం వృద్ధి సాధిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనని వివరించారు.
2000 నుంచి 2024 మధ్య భారత్ డాలర్ పరంగా సగటున 8.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని అనంత నాగేశ్వరన్ తెలిపారు. భారత ఆర్థిక ప్రగతిపై వస్తున్న ప్రతికూల అంచనాలను ఆయన తోసిపుచ్చారు.