ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేతకు ఘన నివాళి
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించి, పేదలు, రైతుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు SS సాజిద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కొప్పుల వేణారెడ్డి గారు, పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ గారు అందించిన సేవలను స్మరించుకున్నారు.
“ప్రజల కోసం జీవించిన మహానేత వైఎస్సార్... ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడు.”
వైఎస్సార్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.