🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 02 Sep 2026, 8:07 PM

QR Code

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్.. తొలి రౌండ్‌లోనే ఇంటిబాట!

News Image

బీజింగ్: భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలి రౌండ్‌లోనే కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

38 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్ 14-21, 7-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన లక్ష్య.. ఆ తర్వాత ప్రత్యర్థి పుంజుకోవడంతో పట్టు కోల్పోయాడు.

రెండో గేమ్‌లోనూ విక్టర్ లాయ్ దూకుడైన ఆటతో లక్ష్యపై ఒత్తిడి పెంచాడు. 11-4తో ఆధిక్యంలోకి వెళ్లిన కెనడియన్ షట్లర్ ఆ తర్వాత కూడా ఆధిపత్యాన్ని కొనసాగించి గేమ్‌ను 21-7తో సొంతం చేసుకున్నాడు.

లక్ష్య సేన్ పదేపదే చేసిన అనవసర తప్పిదాలను లాయ్ సమర్థంగా ఉపయోగించుకోవడంతో మ్యాచ్ పూర్తిగా అతని వైపు మళ్లింది. దీంతో చైనా మాస్టర్స్‌లో భారత ఆటగాడి పోరాటం తొలి రౌండ్‌తోనే ముగిసింది.

🏠 Home