🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 September 2026, 8:42 am Posted by : ARYADVI NEWS

తెలుగు రాష్ట్రాల్లో వానల ముప్పు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

News Image
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణలో హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతం వైపు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది.

మత్స్యకారులకు కూడా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో చేపల వేట కోసం బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని సూచించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
🏠 Home