🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 September 2026, 8:50 am Posted by : ARYADVI NEWS

క్రెడిట్ కొట్టేసేందుకే స్టంట్లు.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు

News Image
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం కొత్తగా పనులు చేపట్టకుండా, గతంలో పూర్తయిన ప్రాజెక్టులకు క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలిస్తూ, దానిని పోలవరం ప్రాజెక్టు జలాలుగా ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. పురుషోత్తపట్నం పంపులు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రస్తుత ప్రభుత్వం నిర్మించినవి కావని పేర్కొన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ఎడమ కాలువ పనుల్లో 79 శాతం పూర్తయ్యాయని జగన్ తెలిపారు. కొత్తగా పనులు చేయకుండా గతంలో పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రజాధనంతో ప్రాజెక్టుల వద్ద ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని విమర్శించారు.
🏠 Home