🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 03 Sep 2026, 11:39 AM

QR Code

సురేఖ రాజీనామాపై ఉత్కంఠ

News Image

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తన అనుచరులతో ఆమె చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అధిష్టానం నిర్ణయం వెలువడకముందే తన నిర్ణయాన్ని ప్రకటించాలనే ఆలోచనలో సురేఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో కొనసాగాలా, లేదా అనే విషయంపైనా అనుచరుల అభిప్రాయాలను తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా, కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం గురువారం తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

🏠 Home