🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 03 Sep 2026, 5:43 PM

QR Code

కృష్ణాష్టమి పూజలో ఈ నియమాలు పాటించాలి

News Image

కృష్ణాష్టమి సందర్భంగా పూజ, ఉపవాసం చేసేవారు కొన్ని నియమాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. పూజ సమయంలో నలుపు, తెలుపు రంగు దుస్తులకు బదులుగా పసుపు, ఎరుపు, పచ్చ రంగుల దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

ఉపవాస సమయంలో ధాన్యాలు, ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ అర్ధరాత్రి శ్రీకృష్ణుడి పూజ పూర్తయిన తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చని చెబుతున్నారు.

అలాగే పగటిపూట నిద్రపోకుండా, కోపం, ఆందోళనకు దూరంగా ఉంటూ రోజంతా ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో గడపాలని సూచిస్తున్నారు.

🏠 Home