🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 September 2026, 7:29 pm Posted by : ARYADVI NEWS

సైదాబాద్ ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఏడు ప్రాంతాలకు ట్రాఫిక్ కష్టాలకు చెక్

News Image
హైదరాబాద్‌ పాతబస్తీ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తగ్గించేందుకు నిర్మించిన సైదాబాద్‌ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి సంతోష్‌నగర్‌ వరకు 3.2 కిలోమీటర్ల పొడవుతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.

రూ.620 కోట్ల వ్యయంతో, 16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రావడంతో సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, చంచల్‌గూడ, ఐఎస్‌ సదన్‌, చంపాపేట్‌, కంచన్‌బాగ్‌, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గనున్నాయి. సుమారు ఆరేళ్ల పాటు కొనసాగిన నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ ప్రాంతాల ప్రజలకు రాకపోకల్లో మరింత సౌకర్యం కలగనుంది.

హైదరాబాద్‌లో ఇది మూడో అతిపెద్ద ఫ్లై ఓవర్‌గా నిలిచింది.
🏠 Home