🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 03 Sep 2026, 10:36 PM

QR Code

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అరెస్ట్.. రూ.3.54 కోట్ల ఆస్తులు గుర్తింపు

News Image

సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ సోమయ్యను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు.. ఆయన కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులకు సంబంధించిన 7 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

సోదాల్లో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి, 5 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు రూ.4.63 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల బ్యాలెన్స్, 709 గ్రాముల బంగారం, 1,750 గ్రాముల వెండి, రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా ఇంట్లో సుమారు రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకులో 66 తులాల బంగారం తాకట్టు పెట్టి రూ.49 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏసీబీ లెక్కల ప్రకారం సోమయ్య ఆస్తుల విలువ రూ.3,54,36,490గా తేలింది. అయితే బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన లావాదేవీలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం సోమయ్యను హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.

🏠 Home