🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 04 Sep 2026, 12:18 AM

QR Code

మహబూబ్‌నగర్ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల ఘర్షణ

News Image

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎదురుపడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన కార్యక్రమానికి సమీపంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

రెండు వర్గాలు బస్టాండ్ కూడలి వద్ద ఎదురుపడటంతో మొదలైన వాగ్వాదం క్రమంగా తోపులాటకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అడిషనల్ డీఎస్పీ రమణారెడ్డి కిందపడిపోయారు. అనంతరం పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

🏠 Home