రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ.. పీఆర్సీ, డీఏలపై చర్చ
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ భేటీలో ఉద్యోగుల ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు.
ముఖ్యంగా పీఆర్సీ, పెండింగ్లో ఉన్న డీఏలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశానికి ఒక్కో ఉద్యోగ సంఘం నుంచి ఒక ప్రతినిధిని ఆహ్వానించారు.
ఉద్యోగుల సమస్యలు, బకాయిల పరిష్కారం కోసం అమరావతి ఐకాస గత నెల 29 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్న నేపథ్యంలో సీఎం భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.