🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 04 Sep 2026, 5:53 PM

QR Code

పేపాల్‌ ఇండియాలో భారీ ఉద్యోగాల కోత

News Image

న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ భారత్‌లో తన కార్యకలాపాల్లో మార్పులు చేపట్టింది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌, పేమెంట్స్‌, ఫైనాన్స్‌ విభాగాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. భారత్‌లోని ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది ఈ తొలగింపుల పరిధిలోకి వచ్చినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, భవిష్యత్‌ వృద్ధికి అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని మార్చుకుంటున్నట్లు పేపాల్‌ వెల్లడించింది. పునర్‌వ్యవస్థీకరణ అనంతరం భారత్‌లో సుమారు 220 మంది ఉద్యోగులు మాత్రమే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

🏠 Home