బీఆర్ఎస్ నేతలకు తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్ సూటి ప్రశ్నలు…?!
కాంగ్రెస్ ప్రజాపాలనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులారా… ముందుగా మీ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలకు లెక్క చెప్పండి!
👉 దళితుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ ఏమైంది?
👉 భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు… ఎంతమందికి ఇచ్చారు?
👉 ఇంటికో ఉద్యోగం అన్న మాట ఏమైంది?
👉 నెలకు ₹3,016 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు… ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చారు?
👉 పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు… దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంతమందికి అందించారు?
👉 కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు… తెలంగాణలో ఎక్కడ అమలు చేశారు?
👉 దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి అందిందా? లేక బీఆర్ఎస్ నాయకులు సూచించిన కొందరికే పరిమితమైందా?
👉 ఉద్యోగాల నోటిఫికేషన్లు సకాలంలో ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగుల జీవితాలతో ఎందుకు ఆటలాడారు?
👉 ధరణి పేరుతో లక్షలాది రైతులను కార్యాలయాల చుట్టూ ఎందుకు తిప్పారు?
⚡ రైతుల కరెంటు గురించి మాట్లాడే ముందు…
పదేళ్లలో రైతులందరికీ రుణమాఫీని ఒకేసారి ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలి. పంట నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయి పరిహారం ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి.
రైతుల కష్టాలను రాజకీయ లాభం కోసం ఉపయోగించుకుంటూ “పిండాకూడు పెడతారు, ఈపులు పగలగొడతారు” అంటూ బెదిరింపు భాష మాట్లాడటం బాధ్యతగల నాయకత్వం కాదు.
🌊 కాళేశ్వరం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు ఉందా?
లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు కుంగాయి?
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సమస్యలు ఎందుకు వచ్చాయి?
అంచనాలు ఎందుకు భారీగా పెరిగాయి?
వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు ప్రాజెక్టు సంపూర్ణ ప్రయోజనం ఎందుకు అందలేదు?
ప్రజల కోసం ప్రాజెక్టులు నిర్మించారా? లేక అంచనాలు పెంచి కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేశారా?
💰 మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది ఎవరు?
2014లో మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణను పదేళ్లలో లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా?
అసంపూర్తి ప్రాజెక్టులు, పెరిగిన అంచనాలు, భారీ అప్పుల భారాన్ని ప్రజలపై మోపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది.
✋ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నది ఒక్కటే…
మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు… మేము వెయ్యి రోజుల పాలనలో ఉన్నాం. రెండు ప్రభుత్వాల పాలనపై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా?
దళిత సీఎం లేదు…
మూడెకరాల భూమి లేదు…
నిరుద్యోగ భృతి లేదు…
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు…
అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు…
కానీ లక్షల కోట్ల అప్పులు, అసంపూర్తి ప్రాజెక్టులు మాత్రం తెలంగాణ ప్రజలకు మిగిల్చారు!
🔥 కాంగ్రెస్ అధికారాన్ని కట్ చేస్తామని బెదిరించే ముందు… తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కుటుంబ పాలనను ఎందుకు కట్ చేశారో ఆలోచించండి!
🔥 ముందు పదేళ్ల వైఫల్యాలకు లెక్క చెప్పండి… ఆ తర్వాత కాంగ్రెస్ ప్రజాపాలనపై మాట్లాడండి!
ప్రజల మధ్యే… ప్రజల కోసం… ✋
మీ..,
మూడ్ మోహన్ నాయక్
తుంగతుర్తి నియోజకవర్గ
టీపీసీసీ సోషల్ మీడియా