🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 September 2026, 7:14 pm Posted by : ARYADVI NEWS

స్వాతంత్ర ఫలాలు బిసి, ఎస్సీ,ఎస్టీల దరి చేరడం లేదు

News Image

బీసీ నేత ధనుంజయ నాయుడు ఆవేదన

అనంతగిరి సెప్టెంబర్ 06 :
స్వాతంత్ర వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్న నేటికీ స్వాతంత్ర ఫలాలు బీసీ, ఎస్సీ,ఎస్టీల దరి చేరడం లేదని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు
ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో బీసీ ముఖ్య నాయకులతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ......
ఒకపక్క దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పాలకులు ఎన్ని కల్ల బొల్లి మాటలు చెప్పినా ఈనాటికి రేషన్ బియ్యం కోసం జనం క్యూలో నిలబడుతున్నారని సరైన వైద్యం అందక అనేకమంది హఠాన్మరణం చెందుతున్నారని నాణ్యమైన విద్య అందక పోటీ పరీక్షల్లో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు వెనుకబడిపోతున్నారని న్యాయ వ్యవస్థ కూడా పేదవాడికి అందుబాటులో లేకుండా పోయిందని అందు కొరకు ప్రభుత్వాలు ఏవైనా సరే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం అందించాలని అప్పుడే స్వాతంత్ర పాలు అందరికీ అందినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఒకేసారి అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలు పంపిస్తున్న భారతదేశం భూమ్మీద ఆకలిని లేకుండా చేయలేక పోయిందని ఇంకా ఆకలి చావులు ఉన్నాయని పౌష్టికాహార లోపంతో అనేకమంది చిన్నపిల్లలు మరణానికి గురవుతున్నారని అంటే భారతదేశం అభివృద్ధి చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదనేది స్పష్టం అవుతుందని, అందుకు కారణం భారతదేశంలో పాలకుల అవలంబిస్తున్న విధానాలు ప్రధాన కారణమని అంబానీ -అదానీ లాంటి కార్పొరేటర్ శక్తులకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ సౌకర్యం కల్పిస్తూ రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్న పాలకుల నిజస్వరూపాన్ని దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాలని మతం పేరుతో కులం పేరుతో ప్రజల దృష్టిని మరల్చి వారు చైతన్యం కాకుండా కేవలం చెక్క భజనలకే పరిమితం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
దేశ జనాభాలో 92 శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనారిటీలు చైతన్యవంతమై మంచి పాలకులను ఎన్నుకుంటే మంచి ఫలితాలు వస్తాయని మతం మత్తులో ఓట్లు వేయడం ద్వారా మరికొన్ని దశాబ్దాలు వెనుకబాటు తనానికి గురవుతారని ఈ వాస్తవాన్ని దేశంలోని యువత గ్రహించి తమ కుటుంబ సభ్యులను చైతన్య పరచాల్సిన బాధ్యత జెన్ జీ యువతపై ఉన్నదని ఆయన అన్నారు
ఆయన వెంట బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి సుందరయ్య బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇనుగుర్తి వెంకట రమణాచారి కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు నిగిడాల వీరయ్య మహిళా విభాగం జిల్లా నాయకురాలు బచ్చు రాజ్యం, నియోజకవర్గ అధ్యక్షురాలు మండవ నాగమణి ఉన్నారు.
🏠 Home