🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 07 Sep 2026, 9:02 AM

QR Code

సర్పంచ్‌లకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్.. త్వరలో కొత్త బిల్లు

News Image

హైదరాబాద్: తెలంగాణలోని సర్పంచ్‌లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. గ్రామాభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు నేరుగా సర్పంచ్‌లకు అందేలా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

గచ్చిబౌలిలో నిర్వహించిన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. త్వరలోనే అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

గతంలో ఉప సర్పంచ్‌లకు ఇచ్చిన చెక్ పవర్ విధానం కారణంగా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

సర్పంచ్‌లు రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు వెనుకాడకుండా ప్రజలకు సేవ చేయాలని సీతక్క సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పనిచేయాలని, ఆదర్శ గ్రామాల దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

🏠 Home