🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 September 2026, 9:27 am Posted by : ARYADVI NEWS

ఘనంగా శ్రీశ్రీశ్రీ వన ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలు

News Image

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు*

కల్లు గీత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన *శ్రీశ్రీశ్రీ వన ముత్యాలమ్మ తల్లి* బోనాల పండుగ వేడుకలకు హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం బోనాల వేడుకల్లో పాల్గొన్న భక్తులకు, కల్లు గీత సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని *కొప్పుల వేణారెడ్డి* గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గుణగంటి కృష్ణ గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జ్యోతి రాజు, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాద రేవతి నవీన్, గుణగంటి సైదులు, గౌడ్ సంఘం జవాన్ గుండాగోని శ్రీను, వీరయ్య, మాస్, బొమ్మగోని మారయ్య, దోరెపల్లి సైదులు, ఎల్గూరి మమత మధు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్, రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్, బొల్లెం వెంకన్న, షేక్ రహీం, కోడి కిరణ్, నర్సింగ్ కిరణ్, పిల్లల నాగరాజు, అనంతుల నవీన్, షేక్ గౌస్ పాషా, నూకల మనోజ్, రావుల రమేష్, బూర సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home