🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 07 Sep 2026, 1:28 PM

QR Code

వైరల్ ఫీవర్.. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

News Image

ప్రస్తుతం వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా H1N1 ఫ్లూ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒంటినొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం ఉంటే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

H1N1 లక్షణాలు సాధారణ ఫ్లూతో పోలి ఉండే అవకాశం ఉన్నందున, లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవడం మంచిది.

🏠 Home