🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 07 Sep 2026, 6:10 PM

QR Code

ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన...

News Image

సూర్యాపేట సెప్టెంబర్ 06: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోదాడ మండల బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాపుగల్లు సర్పంచ్ అప్పారావు, తొగర్రాయి మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, రామలక్ష్మీపురం మాజీ సర్పంచ్ బెల్లంకొండ బ్రహ్మం గౌడ్, యర్రవరం గ్రామ శాఖ అధ్యక్షుడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గుడిబండ గ్రామ వార్డు సభ్యులు కాజా గౌడ్, ఉదయ్ శేఖర్ రెడ్డి, బిక్షం, సింగిల్ విండో మాజీ చైర్మన్ ముత్తవరపు రమేష్, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🏠 Home