🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 07 Sep 2026, 6:47 PM

QR Code

ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు కసరత్తు.. కీలక అప్‌డేట్!

News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు.ఈ ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 11న సంబంధిత కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే 59 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ప్రకటించగా.. మిగిలిన ప్రాంతాల జాబితాలను కూడా త్వరలో వెల్లడించనున్నారు.ప్రస్తుత MPP, ZPP పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 23, 24 తేదీల్లో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు.

🏠 Home