🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 September 2026, 7:02 pm Posted by : ARYADVI NEWS

ఇందిరమ్మ ఇల్లుతో నిరుపేదల సొంతింటి కల సాకారం...

News Image
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబల్లో ఆనందం...

నిరుపేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం...

సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో పేరెల్లి సైదమ్మ సైదులు గార్ల ఇందిరమ్మ ఇల్లును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సూర్యాపేట నియోజకవర్గంలో మొదటి విడుతలో ప్రియతమ నేత దివంగత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి 3500 ఇండ్లు మంజూరు చేయించగా 70శాతం పూర్తి అయ్యాయని, రెండో విడతలో మరో 2000 ఇండ్లను కేటాయించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు.అధికారం చేపట్టిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సులు అమలు చేయడంతో పాటు సన్న వడ్లు పండించిన రైతులకు కింటాకు 500 రూపాయలు బోనస్ అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల భాగంగా మహిళలకు బస్సులను కొనుగోలు చేయించి వారిని యజమానులుగా చేయడం జరిగిందని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆదరించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్, రామసాని శ్రీనివాస్, రూపాని రమేష్, మామిడి ఉపేందర్, మామిడి సురేష్, మామిడి రేనయ్య, మామిడి సాయి, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు ఓవుట సైదమ్మ, మామిడి నగేష్, శ్రీకాంత్, విజయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి మల్లేష్ రాపర్తి నాగరాజు షేక్ రహీం అనంతుల నవీన్ రావుల రమేష్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home