🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 08 Sep 2026, 8:22 AM

QR Code

స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. తాతా మధు అరెస్ట్

News Image

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాతా మధును మండలి నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తాతా మధు స్పష్టం చేశారు. పోలీసులే తనపై దాడి చేశారని ఆరోపించారు.

🏠 Home