కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు, మరణాన్ని కోరుతూ ర్యాలీ నిర్వహించడాన్ని ఖండిస్తూ నడిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నడిగూడెం : తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేసీఆర్ను “ఈ రాష్ట్రానికి పట్టిన పీడ” అంటూ వ్యాఖ్యానిస్తూ, ఆయన మరణాన్ని కోరుతూ 10,000 డప్పులతో ర్యాలీ నిర్వహించడాన్ని బీఆర్ఎస్ మండల సమన్వయ సమితి కమిటీ సభ్యులుఅనంతుల ఆంజనేయులుతీవ్రంగా ఖండించారు.రాజకీయంగా ఎవరినైనా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ అధినేత మరణాన్ని కోరుతూ ర్యాలీలు, నినాదాలు చేయడం రాజకీయ సంస్కారానికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.“తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు పోరాడిన నాయకుడి మరణాన్ని కోరే స్థాయికి రాజకీయాలు దిగజారడం దురదృష్టకరం. రాజకీయంగా విమర్శించండి… విధానాలను ప్రశ్నించండి… కానీ వ్యక్తిగతంగా ప్రాణాలను కోరే రాజకీయాలకు మాత్రం స్వస్తి పలకాలి” అని అన్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత వ్యాఖ్యలు, ర్యాలీపై సమగ్రంగా విచారణ జరిపి, చట్టపరంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ నడిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ తేజస్విని కి పిటిషన్ అందజేశారు.
“కేసీఆర్పై రాజకీయ విమర్శలు చేయవచ్చు… కానీ ఆయన మరణాన్ని కోరడం మాత్రం ప్రజాస్వామ్య హద్దులను దాటడమే. తెలంగాణ సమాజం ఇలాంటి రాజకీయ సంస్కృతిని అంగీకరించదు.” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎస్.కె. జలీల్, మండల ఉద్యమ నాయకులు దున్న ప్రవీణ్, నూకపంగు ఈదయ్య, శ్రీరాముల శేషు, కుంభజడ శీను.రామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.