ఆస్ట్రేలియా బీబీఎల్లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు!
క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
బిగ్‌బాష్ లీగ్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027-28 సీజన్ నుంచి మెల్బోర్న్ రెనెగేడ్స్‌ను పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యానికి విక్రయించనుంది.ఇప్పటికే పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు విదేశీ టీ20 లీగ్‌ల్లో పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు బీబీఎల్ జట్లపై కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఒకే యాజమాన్యం కింద పలు దేశాల లీగ్‌ల్లో జట్లు ఉండే అవకాశం పెరగనుంది.అయితే భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి లేకపోవడం ప్రధాన సవాలుగా మారనుంది. ఆటగాళ్ల లభ్యత, శాలరీ క్యాప్, ప్రసార హక్కులు వంటి అంశాలపై క్రికెట్ ఆస్ట్రేలియా నియంత్రణ కొనసాగనుంది.
మొత్తంగా.. బీబీఎల్‌లో ప్రైవేట్ పెట్టుబడులు ప్రపంచ ఫ్రాంచైజీ క్రికెట్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముంది.