🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 September 2026, 6:17 pm Posted by : ARYADVI NEWS

రేవంత్ రెడ్డిది హిట్లర్ తరహా పాలన: బొల్లం మల్లయ్య యాదవ్

News Image
సూర్యాపేట, సెప్టెంబర్ 09:రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు.రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష గొంతును అణచివేస్తున్నారని ఆరోపించారు.ముఖ్యమంత్రి, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, ఆయనను తక్షణమే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
🏠 Home