🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 September 2026, 7:29 pm Posted by : ARYADVI NEWS

రైతు సంక్షేమమే ప్రాధాన్యం.. మార్కెట్ అభివృద్ధే లక్ష్యం

News Image
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు.ఆయన అధ్యక్షతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించారు. గత సమావేశ తీర్మానాలపై సమీక్షతో పాటు జూన్, జూలై, ఆగస్టు 2026 ఆదాయ, వ్యయాలపై చర్చించి ఆమోదించారు.రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి యండి ఫసియోదీన్ ముక్రం, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
🏠 Home