🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 September 2026, 6:29 pm Posted by : ARYADVI NEWS

డాక్టరేట్ సాధించిన శివకళ్యాణికి అభినందనలు

News Image
సూర్యపేట, సెప్టెంబర్ 10 : నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ అవార్డు సాధించిన కాలతెరిపి శివకళ్యాణిని రామలక్ష్మీపురం గ్రామస్తులు అభినందించారు. గ్రామానికి చెందిన కౌలు రైతు కుటుంబం కాలతెరిపి పాపయ్య, అంజమ్మ దంపతుల కుమార్తె అయిన శివకళ్యాణి కోదాడలో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్ల చేతుల మీదుగా డాక్టరేట్‌ అవార్డు అందుకున్నారు.కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన శివకళ్యాణి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్‌ సాధించడం అభినందనీయమన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలోని విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పుట్టిన గ్రామానికి సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గంగిరెడ్డి తులసమ్మ కన్నారెడ్డి, గ్రామపంచాయతీ కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home