🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 10 Sep 2026, 6:34 PM

QR Code

ఖానాపురంలో కంటి వైద్య శిబిరం....

News Image

సూర్యాపేట ,సెప్టెంబర్ 10: అనంతగిరి మండలంలోని ఖానాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్‌ కంటు లాజర్‌ రిబ్బన్‌ కట్‌ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామీణ పేదలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స అవసరమైన వారిని హైదరాబాద్‌లోని శంకర కంటి ఆస్పత్రికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటు అవసరమైన చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. రోగులకు భోజన సదుపాయం కల్పిస్తూ ఆస్పత్రి బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జగన్‌, మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు నాగేంద్రబాబు, ఉపాధ్యక్షుడు వేముల గోపి, మాజీ సర్పంచ్‌ గింజుపల్లి రఘు, చెరువు డైరెక్టర్‌ రెడ్డబోయిన ఉపేందర్‌, ముదిరాజ్ సంఘం నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసరావు,

తదితరులు పాల్గొన్నారు.

🏠 Home